జ‌న్‌ధ‌న్ యోజ‌న  విజ‌య‌వంత‌మవుతోంది : బ్యాంకింగ్ నిపుణులు

0
135
Spread the love

అందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తెచ్చే దిశలో ప్ర‌ధాన మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న  విజ‌య‌వంత‌మవుతోంది:బ్యాంకింగ్ నిపుణులు

పిఎమ్‌జెడివై 7వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా వెబినార్ నిర్వ‌హించిన పిఐబి

హైదరాబాద్, సెప్టెంబర్ 03, 2021 – అందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తెచ్చే దిశలో ప్ర‌ధాన మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న (పిఎమ్‌జెడివై) విజ‌య‌వంత‌మవుతోందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు.  ‘ప్ర‌ధాన మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న (పిఎమ్‌జెడివై)’ ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్త‌యిన సంద‌ర్భంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ కు చెందిన ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పిఐబి) నిర్వ‌హించిన వెబినార్ లో బ్యాంకింగ్ నిపుణులు మాట్లాడుతూ, కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పేద‌లు నేరుగా ప్ర‌భుత్వ సాయాన్ని పొంద‌డంలో జ‌న్‌ధ‌న్ ఖాతాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయ‌ని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌లెప్‌మెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ రామ్ నారాయ‌ణ్ బోగా  ఈ వెబినార్ లో ప్ర‌సంగిస్తూ, ఆధార్‌, మొబైల్ నెంబ‌ర్ ల‌తో అనుసంధానించిన జ‌న్‌ధ‌న్ ఖాతాల ద్వారా ప్ర‌భుత్వ స‌హాయాన్ని అస‌లైన ల‌బ్ధిదారుల‌కు అందించ‌డ‌మే గాక‌, మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా చేయ‌గ‌లిగామ‌న్నారు. జ‌న్‌ధ‌న్ ఖాతా క‌లిగిన వారికి ‘ముద్ర యోజ‌న’ ద్వారా ఎలాంటి హామీ లేని రుణాల‌ను అందించ‌డ‌మేగాక‌, ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం, జీవిత బీమా, ప్ర‌మాద బీమా స‌దుపాయాల‌ను అందిస్తున్నామ‌న్నారు.  దేశంలో 43 కోట్ల‌కు పైగా జ‌న్‌ధ‌న్ ఖాతాలు ప్రారంభించ‌గా, ఇందులో 55 శాతానికి పైగా ఖాతాలు మ‌హిళ‌ల‌వేన‌ని శ్రీ రామ్ నారాయ‌ణ్ తెలిపారు.

దేశంలో ఇంకా అర్హ‌త క‌లిగిన 11 కోట్ల మంది జ‌న్‌ధ‌న్ ఖాతాలను ప్రారంభించాల్సి ఉంద‌ని అంటూ, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో వీరంద‌రికీ బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు.  జ‌న్‌ధ‌న్ ఖాతా క‌లిగిన వారికి ‘ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న‌’, ‘ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న’, ‘అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న’ గురించి ఆయ‌న వివ‌రించారు.

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మ‌న్ శ్రీ వి. అర‌వింద్ ఈ వెబినార్ లో ప్ర‌సంగిస్తూ, త‌మ బ్యాంకులో 14 ల‌క్ష‌ల జ‌న్‌ధ‌న్ ఖాతాలు ఉండ‌గా, అందులో 8 ల‌క్ష‌ల‌కు పైగా ఖాతాలు మ‌హిళ‌ల‌వేనని చెప్పారు. త‌మ బ్యాంకులో 75 శాతం జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించామ‌ని చెప్పారు. ఒక డాష్ బోర్డు ద్వారా ఖాతాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ జ‌న్‌ధ‌న్ ఖాతా క‌లిగిన‌ ప్ర‌తి వ్య‌క్తికి ‘ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి బీమా యోజ‌న’ స‌దుపాయం క‌ల్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు.  ఇటీవ‌ల విద్యుద్ఘాతంతో మ‌ర‌ణించిన ఒక జ‌న్‌ధాన్ ఖాతాదారుడుకి ‘పిఎమ్ సుర‌క్షా యోజ‌న’ ద్వారా మ‌ర‌ణించిన 48 గంటల్లోనే ఆయ‌న సంబంధీకుల‌కు 2 లక్ష‌ల రూపాయ‌ల మొత్తాన్ని అందించామ‌న్నారు. 

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మ‌న్ శ్రీ కె. ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ, పిఎమ్ జ‌న్‌ధ‌న్ యోజ‌నకు ఆరు అంశాలు మూల స్తంభాలుగా నిలుస్తున్నాయన్నారు.  బ్యాంకింగ్ క‌ర‌స్పాండెంట్‌, బ్యాంక్ మిత్రల ద్వారా.. అంద‌రికీ బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులో ఉంచ‌డం, పొదుపు ఖాతాకు రూ. 10,000 ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం క‌ల్పించ‌డం, ఎటిఎంల వాడ‌కాన్ని ప్రోత్సహించ‌డం ద్వారా ఆర్థిక అక్ష‌రాస్య‌త‌ను పెంపొందించ‌డం, రుణ ఎగ‌వేతల సంద‌ర్భంలో బ్యాంకుల‌కు స‌హాయ‌ప‌డ‌టానికి వీలుగా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటుచేయ‌డం, ఖాతాదారుల‌కు బీమా స‌దుపాయం క‌ల్పించ‌డం, అసంఘ‌టిత రంగంలోని వారికి పెన్ష‌న్ స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  త‌మ బ్యాంకులో 16 ల‌క్ష‌ల జ‌న్‌ధ‌న్ ఖాతాలు ఉండ‌గా, అందులో మూడింట రెండు వంతుల ఖాతాలు మ‌హిళ‌ల‌వేన‌ని చెప్పారు. 

జీరో మాస్ కార్పొరేట్ బిసి డైర‌క్ట‌ర్ శ్రీ లోక్‌నాథ్ పాండా మాట్లాడుతూ, త‌మ సంస్థ ప‌ది వేల అవుట్‌లెట్‌ల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ‌లు అందిస్తోంద‌ని చెప్పారు.  పిఎంజెడివై ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో సాంకేతికత ఎంతగానో దోహదపడిందని ఆయన చెప్పారు.

ఈ వెబినార్ లో పిఐబి, ఆర్ఒబి డైరక్ట‌ర్ శ్రీ‌మ‌తి శృతి పాటిల్ ప్రారంభోప‌న్యాసం చేయ‌గా, ఎస్‌బిఐ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ మోహన్ దాస్ వ‌క్త‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here