గీతం అధినేత ద‌ర్మ‌ర‌ణం ప‌ట్ల దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్ర‌స్టు

0
619
Spread the love

గీతం అధినేత ద‌ర్మ‌ర‌ణం ప‌ట్ల దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్ర‌స్టు

  • ప్రముఖ విద్యావేత్త, విశాఖ పట్నం మాజీ పార్లమెంటు సభ్యులు
  • బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యులు
  • డా. యం వి వి యస్ మూర్తి ఆకస్మిక మరణం పట్ల
  • తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన యాజమాన్యం మరియు సిబ్బంది – సంస్మరణ సభ లో ఘనంగా నివాళులు

అమెరికా పర్యటన సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రముఖ విద్యా వేత్త, రాజనీతిజ్ఞుడు, మాజీ పార్లమెంటు సభ్యులు డా. యం వి వి యస్ మూర్తి కి హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా నివాళులు అర్పించింది. నేటి సాయంత్రం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్మరణ సభలో దివంగత నేత చిత్రపటానికి పుష్పాంజలి తో శ్రద్దాంజలి అర్పించారు. అనంతరం సభకు హాజరైన వారందరూ నిమిషం పాటూ మౌనం పాఠించారు.
కార్యక్రమంలో ముందుగా హాస్పిటల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. ఆర్ వి ప్రభాకర రావు దివంగత నేతకు నివాళులు అర్పిస్తూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ను అభివృద్దిపథాన నడిపించడంలో డా. మూర్తి అందించిన సహాయసహకారాలు, సూచనలు ఎంతో విలువైనవని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఆయన పడే తపన హాస్పిటల్ ను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడానికి ఎంతో దోహదపడిందని దివంగత నేత సేవలను స్మరించుకొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన BIACH&RI ట్రస్టు బోర్డు సభ్యులు డా. జె యస్ ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ దివంగత నేత దాతృత్వ భావనను, సమాజం పట్ల తనకున్న భాద్యతలను నెరవేర్చడానికి చూపిన విశేషకృషిని కొనియాడారు. కేవలం రాజకీయ నాయకునిగానే కాకుండా, అత్యుత్తమ విద్యా సంస్థల స్థాపకునిగా డా. మూర్తి ఆంద్ర ప్రదేశ్ ప్రజానీకానికి విశేష సేవలు అందించారని వారు గుర్తుకు తెచ్చుకున్నారు. ఇంతటి మంచి వ్యక్తి ఆకస్మిక మరణం సంస్థకు తీరని లోటని అంటూ డా. మూర్తి కుటుంభానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డా. జె యస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; లతో పాటూ వైద్య విభాగాల అధిపతులు, వైద్యేతర విభాగాలకు చెందిన ఉద్యోగులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here