ర్యాంకులతో సంభందం లేకుండా విద్యార్థులకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి

0
182
Spread the love

ర్యాంకులతో సంభందం లేకుండా విద్యార్థులకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు బిసి సంఘాల నేతల విజ్ఞప్తి


హైదరాబాద్ ఏప్రిల్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసన్, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంభందం లేకుండా మొత్తం ఫీజుల రియంబర్స్మెంట్ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో నేడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో చర్చలు జరిపారు . కాలేజీ స్థాయి కోర్సు చదివే ఎస్సీ/ఎస్టీ లకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ఫీజు ఇస్తుంది. బీసీలలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిష్ట్, మతపరమైన మైనారిటీలకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తున్నారు కానీ బి.సిలకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలనీ కోరారు.ఇప్పుడున్న 12 బి.సి ఫెడరేషన్లను కార్పోరేషన్లుగా మార్చాలి. బీసీ ఫెడరేషన్ లెక్కలు కార్పొరేషన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఫెడరేషన్ లకు 50 శాతం మార్జిన్ మనీ కట్టాలి, మెంబర్షిప్ కట్టాలి. అదే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 80 శాతం సబ్సిడీ లభిస్తుంది. కార్పొరేషన్ చేయాలని ఆయా బిసి కులాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి.ప్రతి కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన 45 కులాలకు ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. దీని మూలంగా ఆయా కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్రికరణ జరుగుతుంది. అంతే గాక ఈ కులాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన 45 కులాల్లో 12 కులాలకు ఇప్పటికే ఫెదరేశాన్లు ఉన్నాయి. మిగతా 33 బిసి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బిసి కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం 2 సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 75 వేల మంది దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు. మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవి. వీరికి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.బీసీ స్టడీ సర్కిల్స్ బడ్జెట్ 20 కోట్ల నుండి 200 కోట్లకు పెంచాలి. IAS-IPS తదితర సివిల్స్ పోటీ పరీక్షలకు 2 వేల మందిని ఎంపిక, చేసి పేరుగాంచిన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇప్పించాలి. అలాగే బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్-1-2, ఎస్సై, టీచర్లు, పోలిస్ కానిస్టేబుల్ తదితర అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించాలి. ఈ మేరకు బడ్జెట్ పెంచాలి. సాచురేషణ్ పద్ధతి మీద కోచింగ్ ఇప్పించాలి. అవసరమైతే యూనివర్సిటీలలో ప్రైవేటు కాలేజీలలో ఖాళీగా ఉన్న భవనాలను తీసుకొని కోచింగ్ ఇప్పించాలి.ముఖ్యమంత్రి కె.సి.ఆర్ బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వడం కోసం కొత్తగా 238 బీసీగురుకుల పాఠశాలలో మంజూరు చేశారు. అన్ని గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. భవనాలు, సరైన వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశించిన విద్యా ప్రమాణాలు – లక్ష్యాలు నెరవేరడం లేదు. కావున దశలవారీగా గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.IIT, IIM, NEET తదితర కోర్సులు చదివే వారికీ, ఇతర రాష్ట్రాలలో చదివే వారికి ఫీజు రియంబర్స్ మెంట్ పథకం విస్తరింపజేయాలి. ఇవి చాల ముఖ్యమైన కోర్సులు . ఈ కోర్సులలో సీట్లు పొందిన అత్యంత వెనుకబడిన కులాల వారు ఫీజులు కట్టే స్థోమత లేక చదువు మానుకుంటున్నారు.పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1500 నుంచి 3 వేలకు, పాఠశాల హాస్టళ్లకు – గురుకుల పాఠశాల విద్యార్థుల ఆహారపు చార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ.1100/- నుంచి రూ.2000/- కు 3వ తరగతి నుంచి 7 తరగతి వారికి రూ.950 రూపాయల నుంచి రూ.1800 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ధరలు పెరగడంతో భోజనం నాసిరకంగా ఇస్తున్నారు. పెరుగుకు బదులు పలుచటి మజ్జిగ ఇస్తున్నారు. కావున వెంటనే పెంచాలని కోరారు.బి.సిలకు ఇంకా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బి.సి గురుకుల పాటశాలలు మంజూరు చేయాలి. ప్రస్తుతం ఉన్న గురుకుల పాటశాలలు 52 శాతం జనాభా గల బి.సి విద్యార్థులకు సరిపోవడం లేదు. చాల పోటీ పడుతున్నారు. ఈ విషయం లో ప్రభుత్వం ముందుకు వచ్చి కొత్త గురుకుల పాటశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here