సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. కోల్‌కతా ఆస్పత్రిలో చేరిక

0
273
souravganguly
Spread the love

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో, గంగూలీని దగ్గరలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

సౌరవ్ గంగూలీ కుటుంబంతో మట్లాడానని, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ట్వీట్ చేశారు. “దాదా ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. ట్రీట్‌మెంట్ బాగా పనిచేసింది. ఆయన వీలైనంత త్వరగా కోరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆంకాంక్షించారు.

“సౌరవ్ అనారోగ్యం వార్త బాధించింది. ఆయన మైల్డ్ కార్డియాక్ అరెస్ట్(సాధారణ గుండెపోటు)కు గురైనట్లు తెలిసింది. దాంతో గంగూలీని ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మమతా బెనర్జీ తన ట్విటర్‌లో పెట్టారు.
భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా గంగూలీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రార్థిస్తూ, ట్విటర్‌లో దాదా కోసం తన సందేశం పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here