ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రను మార్చేస్తుంది

0
64
Spread the love

ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రను మార్చేస్తుంది

బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, ఆగష్టు 01: 
 ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రను మార్చేస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు ఓటరుగా బాధ్యతను నిర్వర్తించాలని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి అన్నారు.  సోమవారం బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జిహెచ్ఎంసి, జాతీయ సేవా పథకం (NSS) కళాశాల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన, స్వీప్ (sveep) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు… ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా  ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని, ఓటు ద్వారా నే ఉన్నత విలువలున్న నాయకుల్ని ఎన్నుకొనే  బాధ్యత నిర్వర్తించడానికి అవకాశం ఉంటుందని, అందుకు 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 
కొత్తగా ఓటరు నమోదు కు దరఖాస్తు ఫారాలను మార్పు చేసిన నేపథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెడ్ డా.జి నరసింహులు మాట్లాడుతూ…  అన్ని దేశాల కంటే మన దేశ ప్రజాస్వామ్యం గొప్పదని  ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు నేటి యువత ముందుకు రావాలని అందుకు ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 జిహెచ్ఎంసి స్వీప్ నోడల్ అధికారి మహమ్మద్ ముర్తుజా మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన వారు  ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదు గతంలో జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం ఉండేదని, కానీ భారత ఎన్నికల కమిషన్  ఏడాదికి 4 సార్లు  జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల నాటికి  18 సం.రాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO – TS) కార్యాలయంలో  స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ ఓటు నమోదుకు సంబంధించిన దరఖాస్తులైన ఫారం 6, 6 B, 7, 8 సంబంధించి దరఖాస్తు చేసుకునే విధానం, వాటికి కావలసిన ధృవీకరణ పత్రాలు విద్యార్థులు చక్కగా వివరించారు. అన్ లైన్ ఓటర్ హెల్ప్ లైన్, nvsp .in ల  ద్వారా గానీ,  అప్ లైన్ ద్వారా సంబంధిత  ఈ ఆర్ ఓలకు  భర్తీ చేసిన దరఖాస్తు ను  అందజేసే పద్దతులను విద్యార్థులకు  వివరంగా తెలియజేశారు
 ఈ కార్యక్రమంలో కళాశాల పి.డి, స్వీప్ కమిటీ మెంబర్ nss కో – ఆర్డినేటర్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు, కళాశాల nss ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ఎం..మధుకర్ రావు, డాక్టర్ మాధురి, డాక్టర్ శ్రీమతి ఉమామహేశ్వరి లు పాల్గొని  ఓటరు నమోదు, ఓటు హక్కు  విలువ గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here