తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపు 

0
117
Spread the love

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపు 

న్యూఢిల్లీ మే 18 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా.. అంతకు ముందు సంప్రదాయ పూజలు చేశారు. ధర్మాధికారులు, దేవస్థానం బోర్డు అధికారులు, ఉద్యోగులు కార్యక్రమానికి హాజరయ్యారు. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పాండుకేశ్వర్‌ నుంచి ఉత్సవ్‌ డోలీ తీసుకురాగా.. బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి, రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి, ధర్మధికారి భువన్ ఉనియల్, అదనపు ధర్మధికారి రాధాకృష్ణ తప్లియల్, సత్య ప్రసాద్ బత్మిత్‌తో పాటు హరీష్ డిమ్రీ, పూజారి గనా హాజరయ్యారు.ఆలయం తెలుపు తెరిచిన సందర్భంగా సుమారు 20 క్వింటాళ్ల పువ్వలతో అలంకరించగా.. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయం కాంతులీనింది. శీతాకాలం సందర్భంగా ఆలయం గత నవంబర్‌ 16న మూసి వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కేదార్‌నాథ్‌ ఆలయం ఆదివారం ఉదయం తెరుచుకోగా.. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరిచారు. చార్‌ధామ్‌ యాత్రలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చలికాలంలో మూసివేస్తుండగా.. మళ్లీ ఆరు నెలల తర్వాత ఏప్రిల్‌ మే మధ్యలో తెరుస్తారు. ఆలయాల పునః ప్రారంభానికి సన్నాహాలు వారం కిత్రమే చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here