Spread the love
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసు కేసు
జుబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు అనేక ములుపులు తిరిగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఓ అడ్వకేట్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయన పై గ్యాంగ్‌రేప్ బాధితురాలి వివరాలు బయటపెట్టారంటూ పోలీసులు కేసు పెట్టారు. పోలీసు కేసు విషయమై మీడియాతో మాట్లాడిన రఘునందన్‌రావు ఇలాంటి కేసులకు తాను బయపడనని… తనకు కేసులు కొత్తకాదంటూ…. వ్యాఖ్యనించారు. రేప్ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు వీడియోలను రఘునందన్‌రావు మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ విడుదల చేసిన సంఘటన తెలిసిందే. ఇదే విషయమై ఆయనపై కేసు నమోదైంది. అయితే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఐపీసీ సెక్షన్ 28(ఎ) కింద రఘునందన్‌రావుపై కేసు పెట్టారు పోలీసులు.