సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాంధీనగర్ డివిజన్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ శైలజాగోపాల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. చిక్కడపల్లిలోని బాపూనగర్‌లో ఉన్న గణపతి దేవాలయం ఆవరణలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ పోటీలకు ఆర్ ఎస్ ఎస్ సంఘ్ కార్యకర్త పద్మ మరియు ప్రిన్సిపల్ ఉమలు జడ్జీలుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన 5 మందికి బహుమతులు అందించారు. పోటీల్లో పాల్గొన్న ఇద్దరు చిన్నారులకు ప్రొత్సాహక బహుతులు ఇచ్చారు. ముఖ్యఅతిధిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ పావనివినయ్‌కుమార్, అరుణా జయేంద్రబాబు, టి. గోపాల్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయిచంద్, వనజారాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.