నెహ్రూ యువకేంద్రం – రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

0
194
Spread the love

నెహ్రూ యువకేంద్రం – రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హైదరాబాద్, ఆగస్టు 15, 2021 – నెహ్రూ యువకేంద్రం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ సమిష్టి ఆధ్వర్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తేదీ 15-08-2021న మాసబ్ ట్యాంక్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని KVIC మెంబర్ మరియు మాజీ వైస్ చైర్మన్ నెహ్రూ యువ కేంద్ర సంగతం శ్రీ పేరాల శేఖర్ రావు గారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుచు బస్తీలలో యువజన సంఘాలు, మహిళా మండళ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంఘ సేవ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, కోవిడ్-19 పై అవగాహన, రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలి అని అన్నారు. 33 జిల్లాలలో 75 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ అన్షుమాన్ ప్రసాద్ దాస్, స్టేట్ డైరెక్టర్, నెహ్రూ యువకేంద్ర సంగతం, తెలంగాణ, కుమారి ఖష్బూ గుప్త, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ గార్లు మొదటగా రక్తదానం చేశారు.

Don’t Miss Keep Watching

కార్యక్రమంలో డాక్టర్ ఎం. భీం రెండ్డి, ఛైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్, శ్రీమతి పార్వతి సెక్రటరీ, శ్రీ బాలకిషన్, డీన్ ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టర్ జయలక్ష్మి, శ్రీ శ్రీతేజ, సినీ యాక్టర్, శ్రీ వీ. చంద్రశేఖర్, ప్రోగ్రామ్ సూపర్ వైజర్ నెహ్రూ యువకేంద్ర, జాతీయ సేవా వాలంటీర్స్, జిల్లాలోని యువతీ యువకులు పాల్గొన్నారు. డాక్టర్. భీం రెడ్డి ఛైర్మన్ గారు మాట్లాడుతూజిల్లాలో 75 రక్తదాన శిబిరాలు ఈ సంవత్సరం నిర్వహించి, రక్తదానం మహాదానం అని నిరూపిస్తాం అని అన్నారు. శ్రీమతి పార్వతి, శ్రీ వి. చంద్రశేఖర్ గార్లు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here