విజేతలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ బహుమతుల ప్రధానం
హైదరాబాద్, జూన్ 17 (తూఫాన్) కేంద్ర ప్రభుత్వ 8 – ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం నిర్వహించిన ఉపన్యాస, చిత్రలేఖన, పాటల పోటీల విజేతలకు శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, పత్రికా సమాచార కార్యాలయం, డీజీ శ్రీ వెంకటేశ్వర్, అదనపు డీజీ శ్రీ రవీంద్ర, డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్, బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు.
గ్లోబల్ ఆర్ట్ అకాడమీ, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ, అప్సా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రం విద్యార్థులు బహుమతులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పి. ఐ.బి డిజి శ్రీ వేంకటేశ్వ ర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల కాలంలో ప్రాభించందని అన్నారు.