సైబరాబాద్‌లో ఆన్లైన్ యాప్‌ల నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని ప్రకటించారు సైబరాబాద్ సిపి సజ్జనార్. ఇలాంటి యాప్ ద్వారా లోన్ తీసుకుంటే …భారీగా వడ్డీలు వేస్తున్నారని వీటి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్నాటక, వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఆన్లైన్ లోన్లపై కేసులు నమోదయ్యాయని వివరించారు. రుణం తీసుకున్న వారు దాన్ని వడ్డీతో సహా తీర్చినప్పటికీ ఇంకా చెల్లించాలని నిర్వహకులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద పరిధిలోని రాయదుర్గంలో ఇండ్లు అద్దెకుతీసుకొని రెండు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేశారని ఆయన మీడీయకు వివరించారు. ఆన్యన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ప్రౌడ్ ప్రవేట్ లిమిటెడ్‌లు ఉన్నట్టు గుర్తించామని సిపి వెల్లడించారు. ఎండి శరత్ చంద్ర… పుష్పలతలు ఈ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు తాము గుర్తించామన్నని తెలిపారు. ఈ కంపెనీలకు సచిన్ దేశ్‌ముఖ్, చైతన్య కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తుండగా సయ్యద్ హాసిక్ టీమ్ లీడర్‌గా ఉన్నాడని వివరించారు. రెండు కంపెనీలకు చెందిన ఈ కాల్సెంటర్లలో 101 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని సిపి వివరించారు. లోన్ కావాలనుకునేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని వీరు మొదట సూచిస్తారు… ఇచ్చిన రుణానికి 35 శాతం వడ్డీ వసూలు చేస్తారు అని సీపీ చెప్పారు. సుమారు లక్షా 50 వేల మంది కష్టమర్లు ఉండగా.., అప్పు మీద అప్పు తీసుకొని వాటిని చెల్లిస్తున్నవారు 70 వేల మంది యాక్టీవ్ గా ఉన్నట్లు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు విరుద్ధంగా లోన్స్ ఇస్తూ వేధింపులకు పాల్పడ్డారన్న దేశ వ్యాప్తంగా ఈ స్కామ్ నడుస్తుందని సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా సరే ఇన్ స్టంట్ యాప్స్ పేరుతో నిబంధనలకు విరుద్దంగా యాప్స్ క్రియేట్ చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేస్తామని హెచ్చరించారు. ఇన్ స్టంట్ లోన్ యాప్స్ ను ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే…. సైబరాబాద్ క్రైమ్ పోలీసుల నెంబర్ 9490617310, సైబారాబాద్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు 9490617444 కాల్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.