ఓ అబద్దాలకోరు చేతిలో సత్తు తెలంగాణాగా మారిన బంగారు తెలంగాణా ….

0
209
Spread the love

ఓ అబద్దాలకోరు చేతిలో సత్తు తెలంగాణాగా మారిన బంగారు తెలంగాణా ….

2020 వ సం. ప్రారంభం ప్రపంచ మానవాళిని ఒక్కసారిగా ఉలిక్కి పడేసింది.
ఓ క్రొత్త వ్యాధి మహమ్మారిలాగా మానవ జాతిని కుప్పకూల్చడం మొదలు పెట్టింది. ఎక్కడ వార్తలు విన్నా, ఎక్కడ బుల్లితెరమీద చూస్తున్నా వార్తలు వెల్లువలా, శవాల చితుల మీద చలి కాచుకునే ప్రేస్టిట్యూట్ మీడియా విజృంభించి చేస్తున్న కధనాలు మానవుల మనోబలాన్ని చిదిమేస్తుంటే, మనిషిని మనిషి అనుమానించుకుంటూ, ఆత్మీయులను ప‌లంకరించడానికే భయ సందేహాలు కల్పించిన ఘనత మన భారత మీడియా అందునా 19 వక్రాలు కలిగిన కింకరుల వంటి రాత గాళ్ళు, చూపుడు గాళ్ళు చూపించిన భీభత్సం అంతా ఇంతా కాదు. శవాల కుప్పలు, ఆసుపత్రులు అతిగా వసూలు, స్మశానాలలో కూడా చోటు సరిపోవడం లేదు. చూపిన దృశ్యాన్ని వందసార్లు చూపించి మనిషిని పిచ్చివాడిని చేసిన, చేస్తున్న మీడియా వారి వ్యాపారం అపరిమితం. ముఖ్యంగా తెలుగు మీడియా పాత్ర అచంచలం, అమోఘం, అంతులేని కాఠిన్యం.

భారత దేశంలో జాతీయతావాద ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా తరుణం. తెలంగాణ ముద్దుబిడ్డ రెండవసారి పగ్గాలు చేబూనడం. సరిగ్గా ఈ తరుణం లో ఉభయ ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆ మహమ్మారి కోరలలో చిక్కి పోవడం. ఈ మహా ఉపద్రవాన్ని ఎదుర్కోవాలంటే మార్గాలు వెతకాలి. కేంద్ర నాయకత్వం వెంటనే రంగంలో దిగింది. వైద్య ఎమర్జన్సీ పరిస్థితులు వున్నాయి కాబట్టి మనం లాక్డౌన్ విధించుకుందాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన నరేంద్ర మోదీగారి ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇరువది ఒక్క దినాలు దేశం మొత్తం లాక్డౌన్ విధించబడింది, కేవలం అత్యవసరాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలి అంటూ ఆంక్షలు విధించబడినాయి.

ఆశ్చర్యం కరోనా మహమ్మారి దిగి వచ్చింది. దేశ వ్యతిరేక శక్తులు ఎన్ని ప్రయత్నాలు, ప్రయాస చేసినా వారి ఆటలు సాగలేదు. తెలంగాణా ముద్దుబిడ్డ దేశానికి చెప్పారు నేనే మొదటి సారి కంటైన్మెంట్ అనే పదాన్ని వాడాను జోనులు చేశాము, ఆసియా ఆటలకు వాడిన మొత్తం ప్రదేశాన్ని కరోనా రోగుల కొరకు సిద్ధం చేశాము అంటూ చిందులు. మొత్తానికి గండం గట్టెక్కాము.
2021 ఫిబ్రవరిలో దేశంలో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని మరింత ఉధృతంగా ప్రవహించడానికి సిద్ధపడింది. రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీగారు. ఆ యొక్క సమావేశపు వివరాలు మరుసటి రోజున ప్రజలకు తెలియ చేశారు. వివరాలలోకి పోతే గతా 2020 డిసెంబరు మాసంలో జరిగిన సమావేశపు కొనసాగింపు ఈ సమావేశము అని. డిసెంబరు 2020 న జరిగిన సమావేశంలో రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తూ మీరు మీ మీ రాష్ట్రాలలో మీ అవసరాలను మీరు చేసుకోగలరని తెలిపినందులకు చాలా సంతోషం. ఈ ఇచ్చే నిధులతో మీ రాష్ట్రాలలో వెంటనే ఆక్సిజన్ తయారీ కేంద్రాలను స్థాపించుకోగలరు అందులకు మీ కోరిక ప్రకారము అనుమతి ఇవ్వడమైనది.
ఫిబ్రవరి 2021 సమావేశంలో ప్రధాని రాష్ట్ర ముఖ్య మంత్రులతో మాట్లాడుతూ మరి డిసెంబరులో కేటాయించిన నిధుల ప్రకారము మీరు మిమి రాష్ట్రాలలో మీకు కావలసిన అన్ని సదుపాయాలూ సమకూర్చుకున్నారని భావిస్తాను అని అంటూ తగు జాగ్రత్తలు తీసుకోని కరోనాను కట్టడి చేయగలరు అని ముగించి యున్నారు. రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఏమన్నారంటే లాక్డౌన్ మేము చేయము, కంటైన్మెంట్ జోనులు ఏర్పరుచుకుంటాము, మాదగ్గర ఏ విధమైన అత్యవసర స్థితినైనా ఎదుర్కొనే స్థితి వున్నది అని తెలియ పరిచారు అని తెలియచేయబడినది. దీనిని ఏ రాష్ట్ర ముఖ్య మంత్రి ఖండించ లేదు. కాకపోతే మాకు నిధులు కావాలని, వున్నా నిధులు సరిపోవని,వేరే దారులు తెలుపగలరని అలా అందరు తమ తమ విషయాలు కేంద్రం ముందు ఉంచిన తీరు కూడా చర్చకు వచ్చినది.
తెలంగాణా మంత్రివర్యులు మాకు ఆక్సిజన్ నిలువలు కొరత ఏర్పడినది భారత సైన్య యుద్ధ విమానాలను ఆదేశిస్తున్నాము ఆక్సిజన్ మాకు ఒరిస్సా నుంచి తెప్పించగలరు అని. ఇంతటి తక్కువ బుద్ధి వున్నమంత్రిని తెలంగాణా ప్రజలు ఎక్కడైనా, ఎప్పుడైనా చూసి వుంటారా అనేది అనుమానమే? ముఖ్యమంత్రుల సమావేశంలో మన ముఖ్య మంత్రిగారు మాది మేము చేసుకుంటాము అని భరోసా ఇచ్చి వచ్చిన 35 రోజులకు పరిస్థితి విషమించింది కదా. ఆ పరిస్థితిలో మన ముఖ్య మంత్రి వర్యులు కూడా తమ ఆరోగ్యం గురించి లోపటికి పోయారు కదా. పాలన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.
భారత యుద్ధ విమానాలు రాష్ట్రం చేతిలో ఉంటాయా? ప్రజలు పిచ్చివారా? తెలంగాణా మొత్తం అల్లాడుతోంది. రోజుకు గాంధీలో వందల శవాలు బయటకు వస్తున్నాయి, క్యూలో స్మశానాలలో దహనక్రియలు జరుగుతున్నాయి. ఆక్సిజను తయారీ కేంద్రాలు ఏమయ్యాయి, వాటికోసం ఇచ్చిన నిధులు ఎక్కడికి మళ్ళాయి, తండ్రి కొడుకు కూతురు మేనల్లుడు వారి ఆరోగ్య మంత్రిగారు ప్రజలకు జవాబు చెప్పాలి.
ఉత్తర ప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం తమ ప్రజల కోసం 15 ఆక్సిజను తయారీ కేంద్రాలను తామే తయారు చేసుకుంటుంటే, ఎంతో ముందున్నాం, దేశానికి కంటైన్మెంట్ పదం మనమే చెప్పాము, మార్కజుల గురించి మనమే వేగులకు వార్త చెర వేశాము, ప్రజలకు స్వర్గాన్ని తుంచి తెస్తాము, నా పాణం అడ్డు పెడతాను మీ పానాలు కాపాడుతాను అన్న పెద్దమనిషి జాడ తెలియడం లేదు. వున్న ఆరోగ్య మంత్రిగారి తల పని చేయడం లేదు. కొడుకు ఏమైనాడో ఏడ పండినాడో దిక్కులేదు, కూతురు అల్లుడు తెలంగాణా జాగ్రుతంలో తలమునకలేమో, మరి రాష్ట్ర ఆలనా పాలన ఎక్కడో, బంగారు తెలంగాణా వాసులు తెలుప గలరు…. లక్ష మందితో సభ పెడతా, మల్లి వస్తా నేను అంతు చూస్తా …. గిప్పుడు ప్రజల అంతు బాగానే చూస్తున్నరు అన్నా …. ఈ చావులు ఎప్పడు ఆగుతాయి దొరా, కరోనాకు పారాసెటమాల్ అందిస్తారా, ఆక్సిజను ఎప్పుడు దొరికెను దొరా… అంటూ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికైనా అబద్దాలు మాని ప్రజలను ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు, పాలకులను నియమించండి, పాలనను గాడిలో పెట్టండి అంటున్నారు ప్రజలు.

అన‌సూయ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here