షాకింగ్‌: తెలంగాణలో ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా..!

0
206
Spread the love

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉంది… కరోనా లక్షణాలు కూడా కొత్త కొత్తవి బయటపడుతున్నాయి… తాజాగా, షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఎందుకంటే.. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ కేసుల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్, తెలంగాణ ప్రకటించింది. అయితే, మొదటిసారి వైరస్ సోకినప్పుడు ఉన్నంత ప్రభావం రెండోసారి ఉండడంలేదంటున్నారు. కాగా, చైనా దేశంలోనూ కరోనా సోకినవాళ్లకు రెండోసారి మళ్లీ వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి… ఇప్పుడు తెలంగాణలో రెండోసారి కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అంటే.. కరోనా సోకనివాళ్లు జాగ్రత్తగా ఉంటే సరిపోదు.. కరోనా సోకి మళ్లీ రికవరీ అయినవాళ్లు కూడా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. అంతేకాదు.. కరోనానుంచి కోలుకున్నవారికి మళ్లీ ఎప్పుడు ఈ వైరస్‌ ఎటాక్ చేస్తుందోననే టెన్షన్‌ కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here