అనుకోని ఆ ఘటన సిబిఐ కి వెతకబోయిన తీగ దొరకపుచ్చింది

0
258
Spread the love

1993 బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసు రెండు సంవత్సరాల తరువాత కోర్టులో జరగబోయే విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా ఇన్స్పెక్టర్ త్యాగి, ముంబై క్రైమ్ బ్రాంచ్, తన తోటి వారు అందరు వెళ్ళిపోయి 2 గంటలు కావస్తున్నా ఇంకా వుండి విచారణకు కావలసిన అన్ని కాగితాలు సిద్ధం చేసుకోవడంలో మునిగి వున్నారు.

అప్పటికే రెండు సంవత్సరాల క్రితం జరిగిన ముంబై బాంబు దాడుల ఫైలు ముందు వేసుకొని పరిశోధనలో ఏమాత్రం ముందుకు సాగని విషయాలను పదే పదే వల్లెవేసుకుంటూ ఎక్కడ క్లూ దొరుకుతుందేమో అనే ఆశతో చదివిందే చదివి చదివి విసుగు విరామం లేకుండా తల బద్దలు కొట్టుకుంటూనే వున్నారు ఇన్స్పెక్టర్ రమణ్ త్యాగి.

ఇంతలో ఫోను గణ గణ మోగడం మొదలయ్యింది.  ఇన్స్పెక్టర్ రమణ్ త్యాగి పనిలోనుంచి తల ఎత్తి ఓహో ఇంటి నుంచి శ్రీమతిగారు చేస్తోందేమో అనుకుంటూ ఫోన్ తీసి హలో అన్న తడవుగానే అటునుంచి నేను సార్ గుర్తు పట్టారా? మీ సమాచారదారుని.  ఓహ్ నివా చాలా రోజులు తరువాత ఏమిటి సంగతి మసాలా దొరికిందా.

వెంటనే సమాధానంగా ఔను సారూ కారం మసాలా, హా ఎక్కడా ఏమిటి అంటూ త్యాగి ఆతృతగా అడగటం వెంటనే తడువుకోకుండా, 1993  ముంబై బాంబు దాడుల కుట్రదారుల్లో ఒకరు  సారూ, సలీమ్ కుర్లా, హైద్రాబాద్లో వున్నాడని తెలిసింది వెంటనే మీరు బయలుదేరండి వారి తరువాతి వివరాలు మీకు తెలుపుతాను.

ఈలోగా ఇన్స్పెక్టర్ త్యాగి తన అసెట్ ఇచ్చిన ల్యాండ్ లైన్ నెంబర్ గురించి వాకబు చేసి హైదరాబాద్ అని నిర్ధారణకు వచ్చిన తరువాత తన అధికారి సతీష్ ఝా, సూపరింటెండెంట్ అఫ్ పొలిసు వారిని కలిసి తన అసెట్ ఇచ్చిన సమాచారాన్ని వారికి వివరించారు. వెంటనే ఢిల్లీ, ముంబై ఎస్టిఎఫ్ బృందాలను హైదరాబాద్ కు విమానంలో రవాణా కావడం జరిగిపోయాయి.

ఐతే వీరు చేరే సమయానికి హైదరాబాద్ లో  సలీమ్ కుర్లా ఖాళీచేసి వెళ్లిపోయినట్లు తెలిసి ఖంగు తినడం వారి వంతు అయినది.  ఇన్స్పెక్టర్ త్యాగికి అనుమానం కలిగింది ఆ ముంబై డీ కంపెనీ అసెట్ తప్పు సమాచారం ఎప్పుడు ఇవ్వలేదు. ఏదైనా తప్పు జరిగిందా? అసెట్ డబుల్ ఏజెంటుగా మారాడా? ఇత్యాది ఆలోచనలు ముసిరాయి.

మన ఈ కధలో సూత్రధారి సలీమ్ కుర్లా అసలు పేరు సలీమ్ బిస్మిల్లాఖాన్ కుర్లా. ముంబై  డీ కంపెనీలో పేరు మోసిన క్రిమినల్. సలీమ్ కుర్లా ఇంకా కొంతమంది కలసి బాంబు పేలుళ్ల తర్ఫీదు కోసం పాకిస్తాన్ వెళ్లి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఐతే సలింకుర్ల ఇంకొకరితో కలసి గుజరాతుకు సంబంధించిన బిజినెస్ మాన్ ను వంచించిన విషయంగా  కేసులో జైలులో ఇంకొకరితో కలిసి వున్నారు. ముంబై బాంబు పేలుళ్ల సమయంలో జైలులోనే వున్నా కుర్లా. కొద్దీ రోజుల తరువాత జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన కుర్లా ఆచూకీ కోసం ముంబై క్రైం బ్రాంచ్, సిబిఐ సిట్ టీమ్ రెండు సంవత్సరాలుగా భారత్ మరియు పలు దేశాల్లో జల్లెడ పడుతున్నప్పటికీ ఆచూకీ దొరకని పరిస్థితి. ముంబై బాంబు పేలుళ్ల కేసులో కుర్లా సూత్రధారులలో ఒకరని  సిబిఐ కూపీ వర్గాలు ఖచ్చితమైన సమాచారం కలిగి ఉండటమే అతని గురించి వేటకు కారణం.

సిబిఐ వారు ఏదైతే ల్యాండ్ లైన్ ఆధారంగా హైదరాబాద్ వచ్చారో ఆ ల్యాండ్ లైన్ బేగంపేట్ లోని ఒక హోటల్ కు దగ్గరగా వున్న షాపు. అక్కడ ప్రశ్నించడంతో ఆ షాపు అతను తెలిపినది ఏమిటంటే ఆ వ్యక్తి నిన్ననే తాను ఖాళీచేసి వెళుతున్నట్లు తెలిపాడని. సమాచారం విని హతాశులైన సిబిఐ టీము వారు ఈ విషయం ఎస్పీ, సిబిఐ వారికి తెలియ పరచడంతో ఎస్పీ గారు కారాలు మిరియాలు. డిఐజి, సిబిఐ కూడా హైదరాబాద్ వచ్చి ఉండటంతో సిబిఐ అధికారులు కుడితిలో పడ్డ ఎలకలా తమ పరిస్థితి మారడం దయనీయమే.

డీఐజీ నీరజకుమార్ ఎస్పీ మరియు ఇన్స్పెక్టర్ల మీద కోపగించడానికి కారణం. ఇన్స్పెక్టర్లకు ఆ రోజుల్లో విమాన ప్రయాణానికి అనుమతి లేదు. ఏవిధమైన అనుమతి తీసుకోక వారిని విమాన ప్రయాణం చేయించడానికి కారణమైన పేరుమోసిన క్రిమినల్ ముంబై బాంబు పేలుళ్ల కుట్రదారు సలీమ్ కుర్లా. అతను తప్పించుకోవడంతో పైన వారు తనను ప్రశ్నిస్తారు అని భాధ కలగడమే.

సిబిఐ ముంబై టీము వెనుకకు మరలి ఎయిర్ పోర్టుకు కారులో రవాణా అవుతున్న సందర్భంలో నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో నీరజ్ కుమార్ తలా ఎత్తడం అదే క్రమంలో సతీష్ ఝా కూడా తలా ఎత్తి సార్ ఒక్కసారి ఆ ఫోన్ బూత్ వాడిదగ్గర అపార్టుమెంటు కు వెళ్లి పరిశీలిస్తే. ఇద్దరి ఆలోచనా అదే. అనుకున్నదే తడవుగా అందరు ఆ ప్రక్కకు మరలి వెళ్లడం జరిగిపోయింది.

ఫోన్ బూత్ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అపార్టుమెంటులో వాకబు చేస్తే అరే ఇతను నిన్ననే దుబాయికి పోతున్నాము అని తెలిపాడు. ఇక్కడే తన పాత ఫియట్ కారు ఉంటే అమ్మకానికి తీసుకోని పోయాడు అనితెలిపాడు. చేసేది లేక వెనుతిరిగి వస్తుంటే అంకుల్ అని వినపడింది వెనుక చిన్న పిల్లవాడు, ఇక్కడ వున్న పాత స్కూటర్ కూడా అతనిదే ఇప్పుడు వచ్చి తీసుకోని పోతాను అని తెలిపాడు ఆ అంకుల్ అని తెలిపాడు.

వెంటనే అలర్ట్ ఐన వారు బిల్డింగ్ ప్రక్కన ఎదురు చూస్తూ ఉండటం వారి ఆశ ఫలించి ఆ వ్యక్తి సలీమ్ కుర్లా అక్కడకు వచ్చి నెమ్మదిగా స్కూటర్ను నడిపించుకుని పోవడం చుసిన సిబిఐ ఆఫీసర్లు అతనిని అరెస్ట్ చేయడం చక చకా జరిగిపోయాయి.

ఓపికగా ఎదురు చుస్తే తప్పక విజయం సాధిస్తామని ఈ సంఘటన మనకు పదే పదే తెలుపుతుంది. అంతటి క్రూరుడు దొరికిపోయాడు. సిబిఐ ఆఫీసర్లు ఆ తీవ్రవాదితో ముంబై తిరుగు ప్రయాణం అయ్యారు. వెతకపోయిన తీగ కాలికి తగిలింది కదా సుకాంతమయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here