చమ్మక్ చంద్ర “జబర్దస్త్” రీ ఎంట్రీ…?

0
245
Spread the love

తెలుగు కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది బుల్లితెరలో పాప్యులర్ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు.

విదేశాలకు వెళ్లి తమ టాలెంట్ ను ప్రదర్శించగలుగుతున్నారు. “వన్ ఛాన్స్ ప్లీజ్” అని ఎదురుచూసే కమెడియన్స్ కు జబర్దస్త్ అనేది ఓ వరంలా కనిపించింది.

వారి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. ఈ షోకు అనసూయ అలాగే రష్మీ యాంకరింగ్ కూడా ప్లస్సయింది. ఇక జడ్జెస్ విషయానికి వస్తే నాగబాబు అలాగే రోజా తమదైన స్టయిల్లో పంచులు వేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చేవారు. ఆ తరువాత నవ్వుల నవాబు నాగబాబు ఈ షో లోంచి తప్పుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే, ఈ షో ద్వారా విశేషమైన ప్రేక్షకుల ఆదరణను పొందిన చమ్మక్ చంద్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఎంతో కాలంగా చమ్మక్ చంద్ర “జబర్దస్త్”లో తనదైన శైలి ఫ్యామిలీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తునాడు.

ఈలోగా వేరే కామెడీ షో కోసం చమ్మక్ చంద్ర ఈ షో ను వదులుకోవడం జరిగిందన్న టాక్ నడిచింది. ఐతే, రీసెంట్ గా చమ్మక్ చంద్ర కన్ను మళ్ళ్లీ జబర్దస్త్ పై పడిందని టాక్.

మల్లెమాల వారిని చంద్ర ఈ విషయంలో అప్రోచ్ అయ్యాడట కూడా. రీ ఎంట్రీ ఇవ్వాలని బలంగా ఉందని తన మనసులోని మాటను తెలియచేశాడట. వారు కూడా చమ్మక్ చంద్ర ప్రపోజల్ కు దాదాపు ఒకే చెప్పారని టాక్.

మొత్తానికి చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ “జబర్దస్త్” గా ఉండబోతోంది. ఇంతకు ముందు చంద్ర హ్యాండిల్ చేసిన టీమ్ నే చంద్రకు ఇస్తున్నారని కూడా టాక్ వస్తోంది.

“జబర్దస్త్”లో చంద్ర లేని లోటు ఆడియెన్స్ కు క్లియర్ గా తెలిసింది. చంద్ర తిరిగి వస్తే ఎంటర్టైన్మెంట్ మరో లెవెల్లో ఉంటుందని మల్లెమాల టీం కూడా భావిస్తున్నారు. “జబర్దస్త్”కు మునుపటి వైభవం వస్తుందని చంద్ర అభిమానులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here