చెక్ డ్యామ్ ల నిర్మాణాలతో అద్భుత‌మైన‌ ఫలితాలను సాదిస్తున్నాం

0
674
Spread the love

 

రహదారులు & భవనముల శాఖ చేపట్టిన

రహదారి వంతెన-సేతువు (చెక్-డ్యాం) నిర్మాణాలు

చెక్ డ్యామ్ ల నిర్మాణాలతో అద్భుత‌మైన‌ ఫలితాలను సాదిస్తున్న రాష్ట్ర రహదారులు & భవనముల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో వినూత్నంగా రహదారులు మరియు భవనముల శాఖ చెక్ డ్యామ్ – వంతెనల నిర్మాణాలను పెద్ద యెత్తున చేపట్టింది. రహదార్ల అభివృద్ధిలో భాగంగా వంతెనలు, ఆయా వంతెనల నిర్మాణాలలో సాంకేతిక వేసులు బాట్లు ఉన్న ప్రాంతంలలో చెక్ డ్యాo – కo – వంతెనలను పెద్ద యెత్తున చేపట్టింది. ఈ చెక్ డ్యాoల నిర్మాణం వలన ఆయా ప్రాంతాల భూగర్భ జలాల అభివృద్ధి, పశు పక్ష్యాదులు త్రాగునీటి సదుపాయం పర్యావరణ పరిరక్షణ వంటి అనేక ఉపయోగాలు నిబిడీకృతమై ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో ప్రజోపయోగ కరమైన పనులలో ఈ చెక్-డ్యాం ల నిర్మాణాలు అగ్రగామిగా నిలువగలవు. చెక్ డ్యామ్ ల వలన కలిగే ఉపయోగాలు భవిష్యత్తరాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు  రహదారులు & భవనముల మంత్రిత్వ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ముఖ్య మంత్రి శ్రీ కె.సి.ఆర్ గారి సూచనల మేరకు నిర్విరామంగా కృషిసలుపుతున్నారు.

నవసమాజ అభివృధికి, బంగారు తెలంగాణా సాధనకు రహదారుల కీలక పాత్రను గుర్తించిన ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ ఆధ్వర్యంలో షుమారు 14,000 కి.మీ నిడివి గల రహదారుల నిర్మాణం చేపట్టింది.

రాష్ట్ర మంత్రి  తుమ్మల గారి సౌజన్యం తో రాష్ట్ర రహదారులు & భవనముల శాఖ ఈ రహదారుల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. ఈ బృహత్తర పధకంలో భాగంగా మండల కేంద్రాలనుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాలనుంచి రాష్ట్ర రాజధానికి మరియు ఇతర ముఖ్య  పట్టణాలకు అనుసంధానంగా పలు రహదారులను అనుసంధానిస్తున్నారు. ఈ రహదారులలో ప్రస్తుతం ఉన్న ఒక వరుస నుండి రెండువరుసలు గా లేదా రెండు వరుసలనుండి నాలుగు వరుసలుగా వెడల్పు చేయటం మరియు పటిష్ట పరచటం వంటి పనులను లక్ష్యంగా నిర్దేశించింది ప్రభుత్వం.

ఈ మహత్తర కార్యక్రమానికి షుమారు రూ. 18,000 కోట్ల అంచనాలతో ప్రణాళికలు ఏర్పాటు చేసారు రహదారులు మరియు భవనముల శాఖ విభాగం వారు. ఈ రహదారుల నిర్మాణంలో భాగంగా 532 వంతెనలను పటిష్టపరచటం లేదా పునర్నిర్మించటం చేస్తున్నారు R&B శాఖ వారు. ఈ యొక్క వంతెనల నిర్మాణ అంచనావిలువ మొత్తం రూ.2,782 కోట్లు అని తెలిపారు మంత్రి తుమ్మల.

క్ర.సం. స్కీము వివరాలు వంతెనల సంఖ్య అంచనా రూ. కొట్లలో
1 G.O.131 316 1664.65
2 G.O.130 10 18.53
3 G.O.129 9 21.13
4 G.O.604 &424
రహదారి భద్రత
48 74.32
5 Other GOs 19 381.41
6 ప్రణాళికేతర 26 59.23
7 CM Assurance 4 16.25
8 NABARD 54 188.58
9 RDF 44 107.90
10 LWE Phase-II 2 250.00
మొత్తం వంతెనలు 532 2782.00

గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు పైన పేర్కొన్న 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులు బాటు ఉన్న ప్రాంతాలలో      వంతెన-సేతువు (చెక్-డ్యాం) లను కూడా పొందుపరచారు R&B విభాగం వారు. చెక్-డాంల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం, వాటి డిజైన్ మరియు నిర్మాణ ప్రక్రియలో మెళకువలు అధ్యయనం చేయటానికి మహారాష్ట్ర కు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది. ఆ బృందం పలు వంతెనల నిర్మాణాలను పరిశీలించి 200 ప్రాంతాలలో చెక్-డ్యాం ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సమర్పించింది. వీటిలో నీటి లభ్యత 18695 లక్షల లీటర్లగా అంచనా వేయడం అయింది.

వంతెనలకు ఎగువ దిశలో నీటి నిలువకు అనుకూలంగా ఉండే ప్రదేశాల ఎంపిక చాలా కీలకం. చెక్-డ్యాం ల నిర్మాణంలో వంపులు లేని ప్రవాహక్రమం, నీటి నిలువ పరిమాణం, వంతెన మరియు ఇరువైపులా ఉండే కట్టలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ఆకృతుల నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

ఈ చెక్-డ్యాంల నిర్మాణానంతరం పరిసర ప్రాంతాలలో భూగర్భజలాల పెరుగుదల మెరుగుపడినట్లు దాఖలాలు కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదుల తాగు నీటి కొరత ఎంతోకొంత మేర తీరుతున్నది. చెక్-డ్యాం నిర్మాణాలు ఒక ఉద్యమ స్పూర్తితో చేపడితే పచ్చదనం మెరుగుపడి ఆ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని తెలిపిన మంత్రి తుమ్మల. మున్ముందు చెక్-డ్యాంతో కూడిన వంతెనలను హరిత నిర్మాణాలుగా రూపకల్పన చేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు, కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గి పర్యావరణానికి ముందు తరాలకు ఏంతో మేలు చేసినట్లు అవుతుంది.

చెక్-డ్యాం ప్రత్యేకతలు

నదులు లేదా వాగుల పరివాహక ప్రాంతాలలో చెక్-డాంలను వర్షపు నీటి సంరక్షణకు ఆనకట్టల మాదిరిగా ఉపయోగించుకోవటం సాధారణమే. అయితే వంతెనల నిర్మాణంలో చెక్-డ్యాంల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ చెక్-డ్యాంల రూపకల్పన జరిగింది.

వంతెనల నిర్మాణక్రమంలో కేవలం 12% నుంచి 15% అదనపు ఖర్చుతో ఎటువంటి అదనపు వనరుల అవసరం లేకుండా చెక్-డ్యాం లను పొందుపరచవచ్చు. వారధుల కట్టడాలలో నదీ గర్భంలో బల్లపరుపుగా వేసే శ్లాబు నిర్మాణంపై ప్రవాహ దిశకు అడ్డంగా అంటే వంతెనకు సమాంతరంగా కేవలం రెండు లేదా మూడు వరుసల మేసనరి కట్టడం ద్వారా ఈ చెక్-డ్యాం లను నిర్మించుకోవచ్చు.

భూగర్భ జలాల పరిరక్షణ, పశుపక్ష్యాదుల తాగునీటి అవసరార్ధం, ఇతర నీటి వినియోగ అవసరాలకు ఏంతో ఉపయోగంగా ఉంటాయి ఈ చెక్-డ్యాం లు. పెద్దనదులపై నిర్మించే ఆనకట్టల వలన కలిగే ముంపు, వన్య ప్రాణుల అంతరింపు వంటి అభ్యంతరాలు లేకుండా, చిన్న చిన్న మొత్తాలలో పలు ప్రాంతాలలో నీటి నిలువ సాధ్యపడుతుంది. మంత్రి      తుమ్మల నాగేశ్వర రావు గారి ప్రత్యక్ష సారధ్యంలో నిరంతర సమీక్షలతో ఈ చెక్-డ్యాంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చెక్-డ్యాంలు ప్రజల అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రహదారులు & భవనముల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు అని చెప్పిన తుమ్మల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here