టిబెట్‌లో సంయుక్తంగా చైనా, పాకిస్థాన్ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి. వాస్త‌వాధీ

0
155
Spread the love

చండీఘ‌డ్‌ జూన్ 2 (ఎక్స్ ప్రెస్ న్యూ స);: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్‌లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి. వాస్త‌వాధీన రేఖ వెంట జ‌రుగుతున్న ఈ ప‌రిణామంపై అంద‌రి దృష్టి ప‌డింది. యుద్ధ నౌక‌ల‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు స‌ముద్రం నుంచి ల్యాండ్ అటాక్‌ను చేప‌ట్టే రీతిలో విన్యాసాలు సాగుతున్నాయి. వైమానిక ర‌క్ష‌ణ నైపుణ్యాల‌ను కూడా పెంచుకుంటున్నారు. శత్రు విమానాల‌ను, మిస్సైళ్లు, యూఏవీల‌ను టార్గెట్ చేయ‌డం లాంటి అంశాల్లో రెండు దేశాలు శిక్ష‌ణ పొందుతున్నాయి. ఇటీవ‌ల చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ అన్ని యూనిట్ల‌ను ఎయిర్ డిఫెన్స్‌తో ఏకీకృతం చేసింది. వాస్త‌వాధీన రేఖ వెంట పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్ ద‌ళం ప‌టిష్టంగా త‌యార‌వుతున్న‌ట్లు ఓ మీడియా సంస్థ క‌థ‌నం రాసింది. పాక్‌, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు మే 22వ తేదీ న ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ విన్యాసాలు ఈ వారం చివ‌ర వ‌ర‌కు సాగ‌నున్నాయి.నిజానికి చైనా, పాకిస్థాన్ అప్పుడ‌ప్పుడు సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తూనే ఉంటాయి. కానీ భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న‌ ల‌డాఖ్ ప్ర‌తిష్టంభ‌న‌కు ఏడాది పూర్తి కావ‌స్తున్న త‌రుణంలో ఈ విన్యాసాలు ప్ర‌త్యేకత‌ సంత‌రించుకున్నాయి. టిబెట్ శిక్ష‌ణ‌లో ఎంత మంది పాక్ సైనికులు ఉన్నారో స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ చైనా వైపు మాత్రం.. 3 ఎయిర్ డిఫెన్ డివిజ‌న్‌కు చెందిన ద‌ళాల‌న్నీ భాగ‌స్వామ్యం అవుతున్నాయి. సైనిక శిక్ష‌ణ‌లో పాకిస్థాన్ వినియోగిస్తున్న మిస్సైళ్లు ఇక నుంచి పీఎల్ఏ నేవీ ద‌ళంలోనూ క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. పాక్ యుద్ధ నౌక‌లు కూడా ఆ మిస్సైళ్లను మోసుకువేళ్లే చాన్సు ఉంది. దీని వ‌ల్ల స‌రిహ‌ద్దు వెంట భార‌తీయ పైలెట్లు, డ్రోన్లు, మిస్సైళ్లు స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు.ఎల్‌వై-80 వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను చైనా ఇప్ప‌టికే వాడుతున్న‌ది. దీని గురించి ఇండియాకు ముందే తెలుసు. 150 కిలోమీట‌ర్ల రేంజ్ వ‌ర‌కు ఈ స‌ర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్ట‌మ్ ప‌నిచేస్తుంది. మ‌ధ్య స్థాయి ఎత్తులో ప్ర‌యాణించే ఏరియ‌ల్ టార్గెట్‌ను గుర్తించి ఆ మిస్సైల్ సిస్ట‌మ్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు. ప్ర‌స్తుత శిక్ష‌ణ‌లో వాడుతున్న మిస్సైల్స్‌లో ఎస్ఎం-6, ఈగ‌ల్ యాంటీ షిప్ మిస్సైల్స్‌, సీ-802 యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్‌లు ఉన్నాయి. 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను సీ802 మిస్సైల్ పేల్చేస్తుంది. దీన్ని ఫైట‌ర్ జెట్ నుంచి కూడా ప్ర‌యోగించ‌వ‌చ్చు. టిబెట్‌లో ఉన్న స‌ర‌స్సులు, చెరువుల్లో డ‌మ్మీ షిప్‌ల‌పై ఈ మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్నారు. పీఎల్ఏలోని వెస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్‌లో ఉన్న ప‌ది యూనిట్లు ఇప్పుడు ఏకీకృతంగా ప‌నిచేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here