వివాదస్పద వ్యాఖ్యలపై మొత్తం మీద స్పందించిన చినజీయర్
ఎవరినీ అవమానించేలా తాను మాట్లాడలేదని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఒకరిని చిన్న చూపు చూసి మేం మాట్లాడం. మాలాంటి వాళ్లు సమాజానికి కళ్లు. నడస్తుంటే కాళ్లల్లో ఏం దిగుతుందో చెప్పడమే మా బాధ్యత. ఎవరైనా సలహా అడిగితేనే మేం చెబుతుంటాం. పిలస్తే వెళతాం. లేదంటే చూసి ఆనందిస్తాం. 20 ఏండ్ల కింద మాట్లాడిన మాటలపై ఇప్పుడు వివాదమా..? మాట్లాడిన వాళ్లు దాని పూర్వపరాలు చేశారా… లేదా? కొన్ని విషయాలను మాత్రమే పికప్ చేయడం సరికాదు అని ఆయన మీడియాతో ఈ రోజు పేర్కొన్నారు. విషయం తెలుసుకోకుండా ఒక మాటను రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రామానుజక్షేత్రంలో దర్శనానికి టికెట్ పెట్టలేదు. కేవలం నిర్వహణ కోసం రుసుం పెట్టాం. సాధారణంగా ఇలాంటి ప్రాంగణాలను వేలల్లో టికెట్ ధరలు ఉంటాయి. అది ప్రవేశ రుసుము మాత్రమే ఆయన విస్పష్టంగా చెప్పారు. పూజల కోసం టికెట్ లేదు.,, ప్రసాదం కూడా ఉచితమే అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాల్లన్న కోరికా లేదు…. అసలు ఆ ఆలోచనే లేదు అని వ్యాఖ్యనించారు. ఎవరితోనే మాకు గ్యాప్స్ లేవు…వాళ్లకు వాళ్లు పెట్టుకుంటే… మేమేంచేయలేమ్ అని అన్నారు. మాలాంటి వాళ్ల వాళ్లు సమాజానికి కళ్లు… ఏదో హడావుడి కోసం 20 ఏళ్ల కిందటి మాటలను పెద్ద ఇష్యూ చేయడం మంచిది కాదన్నారు. కేవలం పబ్లిసిటీని కోరుకునే అల్పుల ప్రచారం ఇది అని విమర్శించారు.