సినిమా టాకీసులు నడుస్తయ్ – మంత్రి తలసాని
ఎన్ని విమర్శలు వస్తున్నాకానీ…. సినిమా టాకీసులు నడిపించాలనే నిర్ణయించింది ప్రభుత్వం. సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చింది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారని వస్తున్న వార్తలను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ట్రంలో థియేటర్లను మూసివేయడం లేదని తేల్చిచెప్పారు. థియేటర్లు మూసివేస్తారన్న అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. కొవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్లు యథాతథంగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. థియేటర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. అంతేకాకుండా విధిగా మాస్కు ధరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.
Post Views:
210
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4