సివిల్స్ అభ్యర్థుల ఆన్ లైన్ గురు IPS మహేష్ భగవత్ !
సివిల్ సర్వీసెస్ లో చాలా మంది ర్యాంకులు సాధించారు. అయితే వీరిలో చాలామంది రాచకొండ సీపీ మహేష్ భగవత్ శిక్షణ ఇచ్చిన వారే ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 131 మంది వరకు ఆయన సలహాలు తీసుకుని అత్యుత్తమ ర్యాంకులు పొందారు. తాజా ఫలితాల్లో టాప్ త్రీతోపాటు వంద లోపు ర్యాంకులు సాధించారు. ఎన్నో ఏళ్ల నుంచి సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు సీపీ.
అభ్యర్థులకు విలువైన సూచనలిస్తూ ఆన్ లైన్ గురుగా పేరొందారు మహేష్ భగవత్. ఫోన్ కాల్స్, జూమ్ యాప్ ద్వారా సలహాలు ఇస్తున్నారు ఆయన. వాట్సాప్ గ్రూపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తూ మంచి ఫలితాలు సాధించేలే తోడ్పాటు అందిస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, బెంగాల్ కు చెందిన వారు కూడా సీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు.
తాజా బ్యాచ్ లో హైదరాబాద్ తోపాటు ఏపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు మంచి ర్యాంక్ సాధించారు. ఒక్కొక్కరుగా ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మెయిన్స్‌కు ఎంపికైన వారి ఆలోచనలు, దృక్పథాలను తెలుసుకుని మార్పులు సూచిస్తూ వారి విజయానికి సహకరిస్తున్నారు మహేష్ భగవత్. ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది అభ్యర్థులు ఆయన శిక్షణలో పోస్టింగులు పొందారు.