15న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఆర్థిక సాయం

0
148
Spread the love

15న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఆర్థిక సాయం

అమరావతి జూన్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూ స);: ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం కింద మూడో ఏడాదికి త్వరలో ఆర్థికసాయం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15న సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ జరుగుతుందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) తెలిపారు. వాహనాల మరమ్మతు, ఫిట్‌నెస్‌, బీమా పత్రాల కోసం ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా దృష్ట్యా డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నెల ముందే ఆర్థిక సాయం విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here