Spread the love
రేపు సీఎం కెసిఆర్ కీలక క్యాబినెట్ సమావేశం
కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అనగా 17 జనవరి 2022 నుంచి 30 జనవరి 2022 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారు.