అసెంబ్లీలో సీఎం కెసిఆర్ సుధీర్ఘ ప్ర‌సంగం హైలైట్స్‌‌

0
107
Spread the love

అసెంబ్లీలో సీఎం కెసిఆర్ సుధీర్ఘ ప్ర‌సంగం హైలైట్స్‌‌

హైద‌రాబాద్ : ‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించం అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించొచ్చు. బాధ‌తోనే స్కూళ్ల‌ను మూసివేశాం అని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగానే మూసివేశామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ్ర‌హించాల‌న్నారు.

రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌పై అన్ని ర‌కాలుగా ఫైట్ చేస్తాం

ప్రాణం పోయినా స‌రే నీళ్ల విష‌యంలో రాజీప‌డే స‌మ‌స్య ఉత్ప‌న్నం కానేకాదు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై అన్ని ర‌కాలుగా ఫైట్ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లేవి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క అడిగిన ప్ర‌శ్న‌కు సీఎం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు.

జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు తీపిక‌బురు

రాష్ట్రంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. సెక్ర‌ట‌రీల ప‌ట్ల మ‌రోసారి సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అంద‌రి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ జీతాలు ఇస్తామ‌న్నారు.

CM KCR Full Speech Today @ Assembly

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here