2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు

0
108
Spread the love

2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు

   కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారే: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ జూలై 9 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కేసీఆర్‌‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల స్థూపం పేరుతో పెద్ద దోపిడీ జరిగిందన్నారు.  నపై విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కి ఎలా అధ్యక్షుడోతాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్‌ కూడా టీడీపీనేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్‌ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తన పేరు మీదనే కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. “నాకు పీసీసీ వచ్చింది కాబట్టే.. కిషన్‌రెడ్డికి కేబినెట్‌ పదవి” వచ్చిందని రేవంత్‌ పేర్కొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here