నేనే సీఎం గా ఉంటాను..నేను ఆరోగ్యం గానే ఉన్నా

0
223
Spread the love

నేనే సీఎం గా ఉంటాను..నేను ఆరోగ్యం గానే ఉన్నా

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మొదలైన సమావేశానికి దాదాపు 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి కేటీఆర్ నివాళులర్పించారు. సమావేశంలో సీఎం మార్పు గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నేనే సీఎం గా ఉంటాను..నేను ఆరోగ్యం గానే ఉన్నానని అయన తేల్చి చెప్పారు. కేటీఆర్ సీఎం అవుతున్నారనే అంశం మీద స్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడ్తున్నారని ప్రశ్నించారు.

ఏప్రిల్ లో పార్టీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్న ఆయన ఈ నెల12 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని అన్నారు.ప్రతి ఎమ్మెల్యే 50 వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చ్ ఒకటి నుండి పార్టీ కమిటీల నియామకం ఉంట్నుందని అన్నారు. 11 న మేయర్ ఎన్నికలకు అందరూ తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్ లతో కలిసి జిహెచ్ ఎంసీ వెళ్ళాలని, సీల్డ్ కవర్ లో మేయర్,డిప్యూటీ మేయర్ అభ్యర్థులు పేర్లు ఉంటాయని, జిహెచ్ ఎంసీ లొనే కవర్ ఓపెన్ అవుతుందని అన్నారు.

సీఎం మార్పు గురించి ఇకపై ఎవరు మాట్లాడవద్దన్న ఆయన రెండు నెలల పాటు ప్రతి జిల్లా తిరుగుతానని అన్నారు. సీఎం మార్పు అంశంపై మాట్లాడవద్దని సమావేశంలో పలుమార్లు తేల్చి చెప్పిన కేసీఆర్, అయినా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఫిబ్రవరి నెల అంతా మెంబెర్ షిప్ డ్రైవ్, మార్చి నెల అంతా గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ లో రాష్ట్ర కమిటీ,పార్టీ ప్లీనరీ ఉంటుందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here