అసెంబ్లీ వేదికగా లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని… రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టమని తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో బాధతోనే స్కూళ్లను మూసేశామని తెలిపారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. కేసీఆర్ తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని…ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.