జీవో 111 ఇక అవసరం లేదు – సీఎం కెసిఆర్ కీలక ప్రకటన
హైదరాబాద్‌లో 111 జీవో అవసరం లేదా..? మరో 100 ఏళ్ల వరకు నగర నీటి అవసరం తీరిందా.!! సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు. ‘నగరంలోని చిన్న చిన్న నీటి కుంటలు కలుషితం కాకూడదు. 100 ఏండ్ల దాకా నీటి అవసరం హైదరాబాద్‌కు లేదు. జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సుల వచ్చిన తర్వాత 111 జీవో ఎత్తేస్తాం. ‘ అంటూ సీఎం కెసిఆర్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 1996లో అప్పటి తేదేపా ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలో 111 జీవో తీసుకురావడం జరిగింది. అక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల నీటి కలుషితం జరుగుతందన్న అనుమానంతో 111 జీవో తీసుకువచ్చారు. అయితే ఈ నిర్ణయాన్ని చుట్టుపక్కలన గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. రాజేంద్రనగర్, చేవెళ్ల పరిధిలో ఉన్న గ్రామాలు జీవో 111 పరిధిలో వస్తాయి. శంకరపల్లి, చేవెళ్ల, షాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి…. అవన్నీ జీవో 111 పరిథిలోకి వస్తాయి. ఇక్కడ భారీ నిర్మణాలు ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదు. కేవలం ఫామ్ హౌజ్‌లు, ఒక ఫ్లోర్ వరకు మాత్రమే నివాస గృహాలు నిర్మించడం జరిగింది. మొత్తం మీద సీఎం ప్రకటనతో ఇక్కడ ప్రజలు ఆనంద పడుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఇక్కడ కాంక్రీట్ జంగిల్స్ లేకపోవడంతో ఇక్కడ పచ్చదనం ఫరివిల్లిందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
.