పివి నరసింహ రావు జిల్లా గా హుజురాబాద్‌!

0
147
Spread the love

వరంగల్‌ అర్బన్‌ జిల్లా స్థానంలో పివి నరసింహ రావు జిల్లా గా హుజురాబాద్‌!

హుజురాబాద్‌ జూన్ 7 : దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు  తెలుస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్‌ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్‌ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్‌ఎస్‌కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here