Spread the love
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం వచ్చారు. సచివాలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. సమీకృత సచివాలయం పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయి. దసరా పండుగ నాటికి కొత్త సచివాలయంలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన విషయం విదితమే.