సిద్దిపేట జిల్లాలో రేపు సీఎం పర్యటన

0
132
Spread the love

సిద్దిపేట జిల్లాలో రేపు సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్‌ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులూ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు

పోలీస్ కమిషనర్ 

👉రేపు ఉదయం ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో

ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటన కలదు
👉ఉదయం 10.30 గంటల కు వర్గల్ మండలం హౌసుల పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువ లోకి గోదావరి జలాల విడుదల చేయనున్న సీఎం .
👉ఉదయం 11.15 గంటల కు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి గోదావరి జలాల విడుదల చేయనున్న సీఎం.

👉సీఎం  పర్యటన సందర్భంగా పోలీసు కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్ , ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు తో సీఎం  పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా …..

👉అడిషనల్ ఎస్పీలు/03
ఏసీపీలు,, డీఎస్పీలు/05
సీఐలు,, ఇన్స్పెక్టర్లు/20
ఎస్సైలు/ 37 మరియు పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, బీడీ టీమ్స్, రోప్ పార్టీస్, స్పెషల్ పార్టీలతో అధికారులు సిబ్బంది మొత్తం కలిసి 500 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here