బ్లేడుతో గొంతు, చేతి మ‌ణిక‌ట్టు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

0
201
Spread the love

బ్లేడుతో గొంతు, చేతి మ‌ణిక‌ట్టు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ మే 4 (ఎక్స ప్రెస్ న్యూస్ );: న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముసారంబాగ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాద‌న్న‌పేట పీఎస్‌లో ప‌ని చేసే కానిస్టేబుల్ బానోత్ అభిలాస్‌(పీసీ 1748) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న గ‌దిలో బ్లేడుతో గొంతు, చేతి మ‌ణిక‌ట్టు కోసుకుని ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు కానిస్టేబుల్ అభిలాష్‌. కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌లు, ఇత‌ర కార‌ణాల వ‌ల్లే అభిలాష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. అభిలాష్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోదాడ‌లోని అత్త‌గారింట్లో వ‌దిలిపెట్టి వ‌చ్చాడు అభిలాష్. మృతుడి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here