‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కోసం క్రాష్ కోర్సు

0
106
Spread the love
ఈ నెల 18న ‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కోసం ఉద్దేశించిన క్రాష్ కోర్సు’ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

‘కోవిడ్‌-19 ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కు ఉద్దేశించిన క్రాష్ కోర్సు’ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 18 న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్నారు.  దీనితో 26కు పైగా రాష్ట్రాల లో విస్త‌రించి ఉన్న 111 శిక్ష‌ణ కేంద్రాల లో ఈ కార్య‌క్ర‌మం మొదలవుతుంది.  ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ఉంటుంది.  నైపుణ్యాభివృద్ధి, న‌వ‌పారిశ్రామిక‌త్వ కేంద్ర మంత్రి కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొంటారు.

దేశ‌వ్యాప్తం గా ఒక ల‌క్ష మంది కి పైగా కోవిడ్ యోధుల కు నైపుణ్యాల‌ ను సంత‌రించ‌డం తో పాటు, వారి ప్రావీణ్యాల‌ కు మెరుగులు దిద్దాల‌న్నది ఈ కార్య‌క్ర‌మం ధ్యేయం గా ఉంది.  హోం కేర్ స‌పోర్టు, బేసిక్ కేర్ స‌పోర్టు, అడ్వాన్స్ డ్ కేర్ స‌పోర్టు, ఎమ‌ర్జెన్సీ కేర్ స‌పోర్టు, న‌మూనా సేక‌ర‌ణ ప‌ర‌మైన మ‌ద్ధ‌తు, వైద్య చికిత్స సంబంధిత సామ‌గ్రిప‌ర‌మైన మ‌ద్ధ‌తు అనేట‌టువంటి ఆరు ప్ర‌త్యేక నిధుల నిర్వ‌హ‌ణ లో కోవిడ్ యోధుల కు శిక్ష‌ణ ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న 3.0 లో  సెంట్ర‌ల్ కాంపొనంట్ లో భాగం గా మొత్తం 276 కోట్ల రూపాయ‌ల ఆర్థిక వ్య‌యం తో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం వ‌లె ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించ‌డం జ‌రిగింది.  ఆరోగ్య రంగం లో ప్ర‌స్తుత కాలం లోను, భ‌విష్య‌త్తు కాలం లోను ఏర్ప‌డే అవ‌స‌రాల‌ ను తీర్చ‌డానికి నైపుణ్యం క‌లిగిన వైద్య చికిత్సేత‌ర ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల ను సుశిక్షితులు గా చేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here