కోవిడ్ ‘సెకెండ్ వేవ్’ తారాస్థాయిలో ఉండొచ్చు: ఎయిమ్స్ చీఫ్

0
78
Spread the love

కోవిడ్ ‘సెకెండ్ వేవ్’ తారాస్థాయిలో ఉండొచ్చు: ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోరనా వ్యాప్తిని నిరోధించేందుకు మినీ లాక్‌డౌన్‌ల అవసరం ఉందని, వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా గులేరియా ఉన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా తొలి వేవ్‌లో 70,000 మార్క్ చేరడానికి చాలా నెలలు పట్టిందని, ఈసారి తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఈ పరిస్థితి కనబడుతోందని డాక్టర్ గులేరియా అన్నారు. దేశంలో అవసరమైన చోట్ల మినీ లాక్‌డౌన్లు విధించాల్సి ఉంటుందని, సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాలతో పాటు, రోడ్డు, రైలు ప్రయాణాలకు కూడా ప్రజలు దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here