రాష్ట్రాలకు ఉరట.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ 300కు త‌గ్గింపు

0
226
Spread the love

రాష్ట్రాలకు ఉరట.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ 300కు త‌గ్గింపు

న్యూఢిల్లీ ఏప్రిల్ 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : మే 1 నుంచి 18 ఏండ్ల పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌వుతున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ ధ‌ర‌లు దిగివ‌చ్చాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర‌ను త‌గ్గించిన‌ట్టు వ్యాక్సిన్ త‌యారీ కంపెనీ సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పేర్కొంది. రాష్ట్రాల‌కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధ‌ర‌ను రూ 400 నుంచి రూ 300కు త‌గ్గించిన‌ట్టు కంపెనీ బుధ‌వారం పేర్కొంది.త‌గ్గించిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని, త‌మ నిర్ణ‌యంతో రాష్ట్రాల‌కు దీర్ఘ‌కాలంలో రూ వేల కోట్లు ఆదా అవుతాయ‌ని ఫ‌లితంగా అసంఖ్యాక ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చ‌ని ఎస్ఐఐ సీఈఓ ఆధార్ పూనావాలా ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో వ్య‌త్యాసంపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన క్ర‌మంలో ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఎస్ఐఐ, భార‌త్ బ‌యోటెక్ ల‌ను కేంద్రం కోరిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here