కంభంపాటి పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్టణం జూలై 9 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: బీజేపీనేత, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరిబాబుకు విశాఖపట్టణంపై ప్రేమ ఉంటే మిజోరాం గవర్నర్గా వెళ్లనని చెప్పాలన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంటేనే వెళతానని, లేకపోతే వెళ్లనని చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే పుట్టి పెరిగి, రాజకీయంగా ఎదిగిన ఆయన.. విశాఖను శ్మశానంగా చేసి తనను మిజోరాం గవర్నర్గా వెళ్లమంటే ఎలా వెళతానని ఎందుకు చెప్పలేకపోతున్నారని నారాయణ ప్రశ్నించారు. అధికారపార్టీలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ముద్దాయిలుగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖలో కీలకంగా ఉన్న బీజేపీ నేతలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు పోరాటం చేయడంలేదని నారాయణ ప్రశ్నించారు.