Spread the love
హైదారాబాద్ టు గోవా స్థాయిలో నగరంలో గాంబ్లింగ్
సంతోష్ దాబాపై పోలీసుల దాడితో
బయటపడుతున్న నిజాలు
సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి …8 మంది అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో అరెస్టైన నిందితులపై ఇప్పటికే అనేక రకాల కేసులు ఉన్నాయి. కొందరు క్రికెట్ బుకీలు అయితే… మరికొందరు పోకర్ నిర్వాహకులు. ఇక మరికొందరైతే…. ఇంటర్నేషనల్ సిగరేట్ల స్మగ్లింగ్‌కు సంబంధం ఉన్న వారు కూడా ఉన్నారు. నాగార్జునా సినిమా కేడీ చూసే ఉంటారు. అందులో గోవాలో గాంబ్లింగ్ ఎలా జరుగుతుందో చూడచక్కగా చూపించారు. అలా గోవాలో షిప్‌లలో జరిగే పోకర్‌ను ఆడాలనుకున్న వారిని అక్కడికి పంపిచే వారు కూడా హైదరాబాద్‌లో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒక్కొక్కరిది ఒక ఘన చరిత్ర. పోకర్ ను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న వీరంతా పెద్ద మనుషులే. నగరంలో ఒక పెద్ద ఇంటీరియర్ డిజైన్స్ మాల్ ను నిర్వహిస్తున్న వ్యక్తి కూడా ఇందులో ఉండడం గమనార్హం. క్రికెట్ ఆట నడిస్తే…. బుకీలుగా మారిపోతారు…. అది లేని సమయంలో పోకర్ నిర్వహిస్తారు. అయితే వీరి అడ్డా మాత్రం సంతోష్ దాబా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా ఈ గాంబ్లింగ్ నడుస్తోంది.
అయితే ఈ దాబాపై ఎప్పుడు కూడా రైడ్ జరగలేదు. ఎందుకంటే… ఇది అంత సేఫ్ ప్లేస్. ఇది సేఫ్ ప్లేస్ ఎలా అయ్యిందో..? మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరికి చెడిందో కానీ… మొత్తం మీద పోలీసులు రైడ్ చేయడం రెడ్ హ్యాండెండ్‌గా వీరిని పట్టుకోవడం మాత్రం సంచలనంగా మారింది. మొదటి సారి ప్రధాన నిర్వాహకుడు అరెస్టు కావడం విశేషం. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న పోలీసులకు సమాచారం ఎవరు అందించి ఉంటారు అని నిందితులు తలలు గోక్కుంటున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఎటువంటి అడ్డుఅదుపులేకుండా కొనసాగుతున్న ఈ గాంబ్లింగ్ ప్రధాన నిర్వహకుడుతో పాటు పెద్ద తలకాయలపైనే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ఘటన దుమారంగా మారిపోయింది. ఇంకా మరిన్ని ఆస్తకికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇంకా ఎలాంటి విషయాలు బయటకు పొక్కుతాయో వేచిచూద్దాం.
Read This News Also
సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి …8 మంది అరెస్ట్