ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ దారుణ హత్య

0
122
Spread the love

ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ దారుణ హత్య

నల్గొండ ఏప్రిల్ 19 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: జిల్లాలోని నేరుడుగొమ్ము మండ‌లంలో దారుణం జ‌రిగింది. ఆదివారం అర్ధరాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ను దుండగులు దారుణంగా నరికేశారు. మండ‌లంలోని బుగ్గ‌తండాకు చెందిన బుల్లి, నేనావ‌త్ సోమాని.. భార్యభ‌ర్త‌లు. ఆదివారం రాత్రి వారు త‌మ ఇంటి ఆరుబ‌య‌ట నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వారిని హ‌త్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, దంప‌తుల హ‌త్య‌కు భూవివాదాలే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here