పశ్చిమగోదావరి జిల్లా:
ప్రియుడితో కలిసి బైక్ పై పోతుండగా దారుణం..
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రహదారిపై ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపేశాడు. తనతో తెగదెంపులు చేసుకునేందుకు ప్రియుడితో కలసి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు బయలు దేరిన ఆమెను దారికాచి హతమార్చాడు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .. గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన బేతిన చంద్రిక (24) అదే మండలంలోని చిలకంపాడుకు చెందిన దువ్వారపు చంటి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది కాలం సంసారం సజావుగానే సాగింది. స్థలం కొనుక్కుంటానంటే చంద్రిక తల్లిదండ్రులు రూ.5 లక్షలు అల్లుడు చంటికి ఇచ్చారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆరునెలల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన కొమ్ము జెల్సీతో చంద్రికకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె జెల్సీతోనే కలసి ఉంటోంది. భర్తతో ఉన్న గొడవల నేపథ్యంలో అతనిపై గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి విడాకులు తీసుకునేందుకు గొల్లగూడెం నుంచి మొయ్యేరుకు ప్రియుడిని తీసుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరింది. విషయం తెలిసిన భర్త.. వారు ప్రయాణిస్తున్న పెంటపాడు – జట్లపాలెం మార్గంలో మరో ఇద్దరితో కలిసి కాపుకాశాడు. ఘటనా స్థలానికి చేరుకున్నాక మాట్లాడే పని ఉందని చంద్రికను ఆపాడు. చంటి ముందుగా జెల్సీపై దాడిచేయగా అతను తప్పించుకుని పెంటపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత చంద్రికపై దాడిచేసి కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
Post Views:
103