అస‌లు విష‌యం ఎలా లీకైంద‌ని జుట్టు పీక్కుంటున్న నిందితులు‌

0
264
Spread the love
  • నాలుగు నెల‌లు క‌ష్ట‌ప‌డి

  • గ్యాంబ్లింగ్ నిర్వాహ‌కులను ప‌ట్టుకున్న

  • టాస్క్ ఫోర్స్ పోలీసులు

  • అస‌లు విష‌యం ఎలా లీకైంద‌ని

  • జుట్టు పీక్కుంటున్న నిందితులు‌

 

గుట్టుచ‌ప్పుడు కాకుండా హైద‌రాబాద్‌లో గ్యాంబ్లింగ్ నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాన సూత్ర‌ధారులు  పాత్ర‌ధారుల‌ను ప‌ట్టుకునేందుకు టాస్క్‌ఫోర్ పోలీసులు బాగానే శ్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెల‌ల పాటు వీరు నిఘా పెట్టి ఉంచిన‌ట్లు సమాచారం. అలా చ‌మ‌టోడ్చి ప్ర‌ధాన వ్య‌క్తితో స‌హా గ్యాంబ్లింగ్‌తో సంబంధం ఉన్న ముఖ్య పాత్ర‌దారలంద‌రూ ఒక్క చోటే ఉన్న స‌మ‌యంలో ప‌ట్టుకోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

కేవ‌లం పోక‌ర్ నిర్వ‌హించే వారే కాకుండా….. క్రికెట్ బుకీ కేసుల్లో గ‌తంలో అరెస్టైన వారు కూడా ఇందులో ఉండ‌డం గ‌మ‌నార్హం. న‌గ‌రంలోనే ఫేమ‌స్ అయిన పాన్ షాప్ నిర్వ‌హ‌కుడుతో పాటు ఇంటీరియ‌ర్ డిజైన్ బిగ్గెస్ట్ మాల్ న‌డిపే వ్య‌క్తి కూడా ఈ కేసులో అరెస్టు కావ‌డం విశేషం. టాస్క్‌పోర్స్ పోలీసుల దాడిలో ఈ కేసు బ‌య‌ట‌ప‌డ‌డంతో లా అండ్ పోలీసుల‌కు నోట్లో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌త్తైంది. ఎంతో కాలంగా సంతోష్ దాబాలో గుట్టు చ‌ప్పుడు కాకుండా గ్యాంబ్లింగ్ జ‌రుగుతోంద‌ని ఈ కేసుతో అర్థ‌మైపోతోంది. అయితే లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌కు ఏ మాత్రం తెలియ‌కుండానే ఇక్క‌డ గ్యాంబ్లింగ్ జ‌రుగుతోందా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మొత్తం మీద లా అండ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల‌పై గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం. నాలుగు నెల‌ల పాటు క‌ష్ట‌డి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంబ్ల‌ర్స్ ప్ర‌ధాన నిర్వాహ‌కుల‌ను ప‌ట్టుకోవ‌డం ఒక సంచ‌ల‌నంగా తయారైంది. సంతోష్ దాబా నిర్వ‌హ‌కుడితో వ్యాపార‌ వైరాలు ఉన్న‌వారు ఇచ్చిన స‌మాచారంతో వీరు పోలీసుల‌కు చిక్కారా..;? లేక నిందితుల‌కు సంబంధించిన వారే ఎవ‌రైనా ఇలా చేశారా‌? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మొత్తం మీద ఈ కేసుతో సెంట్ర‌ల్ జోన్ లా అండ్ ఆర్డ‌ర్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అస‌లు ప‌డ‌డం లేద‌ని భోగ‌ట్టా. ఎనిమిది మంది నిందితులు ఉన్న ఫొటో ముందు మీడియాకు రిలీజ్ అయ్యింది. కానీ పోలీసులు 7 గురి వివ‌రాలు మాత్ర‌మే తెలియ‌జేశారు. ఒక్క‌రిని కావా‌ల‌నే త‌ప్పించేందుకు కూడా గ‌ట్టి ప్ర‌య‌త్నం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్ర‌మ్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ కేసుతో సంచ‌ల‌నం సృష్టించార‌న్న‌ది వాస్త‌వం. అస‌లు టాస్క్ ఫోర్స్ పోలీసుల‌కు సంతోష్ దాబాలో తామున్నామ‌న్న విష‌యం ఎలా లీకైంద‌ని నిందితులు జ‌ట్టుపీక్కుంటున్నార‌ని  స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here