12 శాతం క్రైమ్ రేట్ తగ్గింది – సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్‌

0
437
annual crime report of 2020 by CP mahesh bhagavath
rachakonda police annual report 2020
Spread the love

2020 వార్షిక నివేదికను విడుదల చేశారు రాచ‌‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్‌ మహేష్ భగవత్ . పోయిన సంవ‌త్స‌రంతో పొలిస్తే..ఈ ఏడాది 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని మహేష్ భగవత్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో దోపిడీలు, దొంగతనాలు కేసుల్లో 53 శాతం రికవరీ పెరిగిందని, మహిళలపై వేధింపుల కేసులు 11 శాతం పెరిగాయని, రాచకొండ పరిధిలో 41 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 202 ఎక్సైజ్ కేసులు, 105 అక్రమంగా పిడిఎస్ రైస్ తరలింపు కేసులు, 704 సైబర్ క్రైమ్ కేసులు, 49026 సోషల్ మీడియా కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11892 సిసి కెమెరాలు ఏర్పాట చేశామని భగవత్ వెల్లడించారు. ఈ ఏడాది షీ టీమ్స్ 332 కేసులు నమోదు చేయగా బాల్య వివాహాలు 92, ఆపరేషన్ ముస్కాన్ కింద 259 మంది పిల్లలను కాపాడామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 3203 కేసులు, ఇందులో 324 మందికి జైలు శిక్ష వేశామని భగవత్ వెల్లడించారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్‌కు వేగంగా స్పందిస్తున్నామన్నారు. రాచకొండ ఐటి సెల్ కానిస్టేబుల్‌కు జాతీయ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here