మొక్కల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్ధ ప్రదర్శించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

0
208
Spread the love

మొక్కల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్ధ ప్రదర్శించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

మొక్కల పెంపకానికి సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TRAC) అభివృద్ధి చేసిన “మొక్కల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్ధను” ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మరియు ఇతర సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించారు. ఈ వ్యవస్ధ ద్వారా శాటిలైట్ డాటా ఆధారంగా మొక్కలు పెంచడానికి అవకాశమున్న అవెన్యూ, బ్లాక్, వ్యక్తిగత సైట్లను గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. మోబైల్ ద్వారా మొక్కలు పెంచే సైట్లను తెలుసుకునేలా పోర్టల్, ప్లాంటేషన్ పూర్తి వివరాలతో డాష్ బోర్డు ను కూడా TRAC అభివృద్ధి చేసింది.
ఈ విషయమై TRAC టీంకు నేతృత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డిని ప్రధాన కార్యదర్శి అభినందిస్తూ పచ్చదనం పెంపుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా రూపొందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ కు అనుగుణంగా ఈ వ్యవస్ధ ఉందన్నారు. మల్టీలేయర్ ప్లాంటేషన్, సరస్సులు, రోడ్లు, వివిధ ప్రదేశాలలో ఖాళీలు లేకుండా మొక్కలు పెంచడానికి అధికారులు దృష్టి పెట్టేలా ఈ వ్యవస్ధ ఉపయోగపడుతుందని ప్రధాన కార్యదర్శి అన్నారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, అటవీ శాఖ పిసిసిఎఫ్ శ్రీమతి శోభ, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, PCCF (SF) శ్రీ డోబ్రియల్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ, మెడ్చల్ కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, రంగారెడ్డి కలెక్టర్ శ్రీ అమయ్ కుమార్, సి.యం ఓఎస్డి శ్రీమతి ప్రియాంకా వర్గీస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here