ఏపి లో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

0
204
Spread the love

ఏపి లో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి జూన్ 7 : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌ మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ వివిధ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు నడవనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ విధించింది. మే 31తో గడువు ముగియడంతో జూన్‌ 10 వరకు కర్ఫ్యూను పొడిగించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here