బంగాళాఖాతంలో కొనసాగుతున్న “తీవ్ర అల్పపీడనం”

0
42
Spread the love

బంగాళాఖాతంలో కొనసాగుతున్న “తీవ్ర అల్పపీడనం”

తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు(అక్టోబరు 10 వ తేదీ) ఉదయం 05.30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈరోజు ఉదయం 08.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపొస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబరు 12 వ తేదీ ఉదయం/ మధ్యాహ్నం వాయుగుండముగా తీరాన్ని దాటే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఉత్తర అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా అక్టోబర్ 14 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
————————–

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
—————————————————
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.
విశాఖపట్నం, తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు;
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.
తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలుతో పాటు అత్యంతభారీ వర్షాలు;
విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు;
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు;
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలుతో పాటు అత్యంతభారీ వర్షాలు;
గుంటూరు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు;
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :
————————
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
చిత్తూరు, అనంతపురం జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు;
కడప, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది.
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

సంచాలకులు,
అమరావతి వాతావరణ కేంద్రము .

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here