కేసీఆర్ తిరగాల్సిన గుడులు.. అమరవీరుల ఇల్లు – దాసోజు

0
42
Spread the love

సీఏం కేసీఆర్ పుణ్యం కోసం గుడులు గోపురాలు తిరుగుతున్నారు. మంచిదే. కానీ కేసీఆర్ తిరగాల్సిన గుడులు.. అమరవీరుల ఇల్లు” అని వ్యాఖ్యానించారు ఏఐసిసి అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలతో కలసి గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్యతో కలసి మాట్లాడారు దాసోజు. ”తెలంగాణ ఒక్కరి పోరాటం వలన వచ్చిన రాష్ట్రం కాదు. సబ్బండ వర్గాల ప్రజల పోరాటం, వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదు. కానీ నేడు అధికార మదంతో, ఆదిపత్య అహంకారంతో దున్నపోతు మీద వాన కురిసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమరవీరులు కుటుంబాలకు న్యాయం చేయకపోగా వారిని అవమానించే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం ” అని మండిపడ్డారు దాసోజు.

”2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టో తయారు చేసిన కమిటీలో నేనూ ఓ సభ్యుడిని. ఆనాడు ఎంతో భావోద్వేగంతో అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని అనేక అంశాలు పొందుపరిచాం. ”అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం. అమరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్న నిర్మాణం. వ్యవసాయం ఆదారపడ్డ కుటుంబాలకు సాగు యోగ్యమైన మూడు ఎకరాల భూమి. అమరుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు, అమరుల కుటుంబ సంక్షేమం. ప్రసిద్ది గాంచిన నిర్మాణ స్థాయిలో హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన అమరుల స్మారక స్థూప నిర్మాణం. అదే ప్రాంతంలో అమరుల స్మృతి వనం నిర్మాణం. నిరంతరం వెలిగే త్యాగ జ్యోతి ఏర్పాటు” ఈ అంశాలు మేనిఫెస్టో లో చేర్చారు. కానీ ఎనిమిదేళ్ళు గడుస్తున్నా అమరులకు న్యాయం జరగలేదు. మ్యానిఫెస్టో లో పొందుపరిచిన ఒక్క హామీకు నెరవేర్చలేదు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అనుభవిస్తున్న అధికారం, దర్పం.. అమరవీరుల త్యాగఫలం. అమరుల రక్తపు మడుగులపై టీఆర్ఎస్ నాయకులు కూర్చి వేసుకొని కూర్చున్నారనే సంగతి మర్చిపోవద్దు” అని గుర్తు చేశారు దాసోజు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here