ఐదు జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీసిఎం కడియం శ్రీహరి సమీక్ష

0
216
Spread the love

ఐదు జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీసిఎం కడియం శ్రీహరి సమీక్ష

· వర్షాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు

· లోతట్టు, ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు

· చెరువులు, గట్లు తెగకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలి

· రెవెన్యూ, నీటిపారుదల, మునిసిపల్, పంచాయతీరాజ్, పోలీస్ సమన్వయంతో పనిచేయాలి

· ఆపదల నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సేవలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి

వరంగల్, ఆగస్టు 20 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామా, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో వర్షాల వల్ల ఉన్న పరిస్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా చూసుకోవాలన్నారు.

మహబూబాబాద్ పట్టణంలో కాలనీలలోకి నీళ్లు వస్తున్నాయని, రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్, మునిసిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనేచేసి ప్రజలకు సహకారం అందించాలన్నారు. వెంటవెంటనే కాలనీల్లోకి వచ్చిన నీటిని జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో తీసివేయాలన్నారు.

భూపాలపల్ల మంగంపేట దగ్గర గోదావరి వరదల వల్ల కోతకు గురవుతున్న గట్టును పరిశీలించి ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలని సూచించారు.

వరంగల్ మహానగరంలో జలమయమయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు కాలనీల్లోకి చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జలమయమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అవసరమైన వసతి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జలమయమైన కాలనీల్లోని నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెవెన్యూ, మునిసిపల్, నీటిపారుదల, పోలీస్ సిబ్బంది అన్ని జిల్లాల్లో తగు సమన్వయంతో వ్యవహరించేలా కలెక్టర్లు చూసుకోవాలని చెప్పారు.

జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల ఆపదల నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే సమయంలో అవసరమైన సామాగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here