హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ 100 శాతం విజ‌య‌వంతం: డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

0
91
Spread the love

హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ 100 శాతం విజ‌య‌వంతం: డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ మే 27 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: లాక్‌డౌన్ అమ‌లును డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎర్ర‌గ‌డ్డ‌, బాలాన‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, సుచిత్ర‌, కొంప‌ల్లి, కండ్ల‌కోయ ప్రాంతాల్లో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసుల‌కు డీజీపీ ప‌లు సూచ‌న‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ 100 శాతం విజ‌య‌వంత‌మైంద‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నారు. లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గాయ‌న్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రాష్‌ర్టంలోకి రావాలంటే ఈ-పాసులు తప్ప‌నిసరి అని స్ప‌ష్టం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డ‌మే పోలీసు శాఖ ల‌క్ష్య‌మ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here