స‌మ‌ర్థ‌వంతంగా కొన‌సాగుతోన్న లాక్‌డౌన్: డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

0
100
Spread the love

స‌మ‌ర్థ‌వంతంగా కొన‌సాగుతోన్న లాక్‌డౌన్: డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ మే 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తెలంగాణ రాష్ర్టంలో చిన్న ప‌ట్ట‌ణాల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు లాక్‌డౌన్ స‌మ‌ర్థ‌వంతంగా కొన‌సాగుతోంద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కూక‌ట్‌ప‌ల్లిలో లాక్‌డౌన్‌ను ప‌రిశీలించి పోలీసు అధికారుల‌కు డీజీపీ ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు రావొద్దు అని ప్ర‌జ‌ల‌కు డీజీపీ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌లంద‌రూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. లాక్‌డౌన్ వేళ‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేసి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇత‌ర రాష్ర్టాల నుంచి తెలంగాణ‌లోకి ప్ర‌వేశించే వారికి ఈ-పాసులు త‌ప్ప‌నిస‌రి అని డీజీపీ తేల్చిచెప్పారు. ఈ-పాసును ఎక్క‌డ తీసుకున్నా అనుమ‌తిస్తామ‌న్నారు. పాసుల‌ను దుర్వినియోగం చేయ‌కూడ‌ద‌న్నారు. రైతుల వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఎక్క‌డా ఆటంకం క‌లిగించ‌డం లేద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here