తిరిగి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా

0
235
Spread the love

తిరిగి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా

        టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు ధర్మపురి సంజయ్ 

హైదరాబాద్ జూలై 13 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తిరిగి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు  ఆ పార్టీ నేత డి.శ్రీనివాస్ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్  అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో మహబూబ్‌నగర్ బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్తో కలిసి  ధర్మపురి సంజయ్‌ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధర్మపురి  మాట్లాడుతూ… కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేను మా నాన్న కోసమే మధ్యలో  టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు.. గులాబీ కండువా ఒక గొడ్డలి లాంటిది. టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీ కాదు.. జిల్లా అద్యక్షుడికి గుర్తింపు లేదు’’ అన్నారు.  ‘‘రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించాను. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతా.. పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కాగా బీజేపీ మహబూబ్ నగర్ అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ పార్టీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here