డిజిటల్ వ్యాన్ల ద్వారా కరోనాపై ప్రచార కార్యక్రమం
హైదరాబాద్ (మార్చి 19, 2021) : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన రీజనల్ అవుట్రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 26 వరకు డిజిటల్ వాహనాల ద్వారా సరిహద్దు జిల్లాలలో కరోనాపై ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు టీకా ద్వారా చేకూరే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఆడియో, వీడియో సందేశాల ద్వారా ఐదు రోజులపాటు ఆయా జిల్లాలలోని అన్ని మండలాలలో ఈ ప్రచార కార్యక్రమం చేపడుతుంది. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాలైన బస్టాండ్, రైల్వే స్టేషన్, సంతలు, మార్కెట్లు, కూడళ్లలో ఈ డిజిటల్ వాహనాలు ప్రచారం చేపడతాయి. పొరుగు రాష్టాలలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా సరిహద్దు జిల్లాలైన మహబూబ్నగర్, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
Post Views:
189
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4