ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో నానికి తెలియదా : దివ్యవాణి

0
73
Spread the love

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. కొడాని నాని మాటతీరు, పనితీరుతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కొడాలి నానిని చూస్తే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అయినట్టు ఉంటుందని ఘాటు వ్యాక్యలు చేసారు. చంద్రబాబుది చంద్రమండల స్థాయని.. ఆయనను విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబును నాని విమర్శిస్తున్నారని…ఆరోజు జరిగిన పరిణామాలకు కొడాలి స్క్రిప్ట్ రాశాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఖర్జురనాయుడి ఫ్యాక్షనిజం వలలో రౌడీయిజం వల్లో చంద్రబాబు సీఎం కాలేదని దివ్యవాణి వ్యాఖ్యానించారు. కొడాలి లాంటి వాళ్లు ఎన్ని వ్యాఖ్యలు చేసినా..చంద్రబాబు తెల్లవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదని అన్నారు. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు… మంత్రి పదవి వస్తే ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. మంత్రి స్థాయి వ్యక్తి లారీలతో గుద్దిస్తామని వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here